ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే పేస్కేల్ ప్రకటించనున్నట్లు ప్రజా రవాణా సంస్థ(ఆర్టీసీ) ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. తిరుపతి, అలిపిరి, మంగళం, చంద్రగిరి బస్టాండ్లను పరిశీలించిన ఆయన విలేకరులతో ఆమట్లాడుతూ 52 వేల మంది ఉద్యోగులను త్వరలోనే నూతన పే స్కేల్స్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రవ్యాప్తంగా సర్వీసుల్లోకి తీసుకొస్తామని, ప్రపంచ స్థాయి నాణ్యతతో ఇవి పనిచేస్తాయని తెలిపారు.