భార్య, పిల్లల్ని ఎక్కడ పెట్టావ్​ భాయ్​

By udayam on July 22nd / 2:01 am IST

బాలీవుడ్​ మోస్ట్​ వాంటెడ్​ భాయ్​ సల్మాన్​ ఖాన్​కు అతడి తమ్ముడి నుంచే అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది. ‘నీకు భార్య, పిల్లలు కూడా ఉన్నారంట కదా?’ అంటూ అర్బాజ్​ ఖాన్​ ఓ షో ఇంటర్వ్యూలో భాగంగా సల్మాన్​ను ప్రశ్నించాడు. దాంతో సల్మాన్​ ‘నువ్వు నన్నే ఈ ప్రశ్న అడుగుతున్నావా?’ అంటూ బదులిచ్చాడు. అర్భాజ్​ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పించ్​ అనే షో కు వచ్చిన సల్మాన్​కు ఈ ప్రశ్న ఎదురైంది. ఆన్​లైన్​లో ఓ స్టార్​కు అభిమానుల నుంచి వచ్చే ప్రశ్నల్నే ఇక్కడ అర్భాజ్​ అడుగుతూ ఉంటాడు.

ట్యాగ్స్​