బీస్ట్​ లుక్​లో సల్మాన్​ఖాన్​

By udayam on July 21st / 8:02 am IST

సల్మాన్​ఖాన్​ కెరీర్​లో సూపర్​హిట్​లుగా నిలిచిన టైగర్​ సిరీస్​లో మరో పార్ట్​ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్​నే ప్రకటించాడు. 2012లో ఏక్​ థ టైగర్​, 2017లో టైగర్​ జిందా హై సినిమాలతో హిట్లు అందుకున్న అతడు ఇప్పుడు ఈ సిరీస్​లో 3వ పార్ట్​కు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం అతడు జిమ్​లో చేస్తున్న కసరత్తుల వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. 55 ఏళ్ళ సల్మాన్​ తన పోస్ట్​లో ‘ఈ వ్యక్తి మరో టైగర్​ కోసం ట్రైనింగ్​ అవుతున్నాడు’ అంటూ కామెంట్​ పెట్టాడు.

ట్యాగ్స్​