రికార్డుల బద్దలు కొడుతున్న మినీ వేలం: కుర్రాన్​ కు 18.5 కోట్లు, గ్రీన్​ కు రూ.17.5 కోట్లు, బెన్​ స్టోక్స్​ కు రూ.16.25 కోట్లు, పూరన్​ రూ.16 కోట్లు

By udayam on December 23rd / 11:14 am IST

కొచ్చిన్​ లో జరుగుతున్న భారత ఐపిఎల్​ మినీ వేలంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఐపిఎల్​ వేలంలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇంగ్లాండ్​ యువ ప్లేయర్​ సామ్​ కుర్రాన్​ ఈరోజు చరిత్ర సృష్టించాడు. అతడి కోసం పంజాబ్​ జట్టు ఏకంగా రూ.18.5 కోట్లు వెచ్చించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా యువ బ్యాటర్​ కేమరూన్​ గ్రీన్​ ను ముంబై రూ.17.5 కోట్లు, బెన్​ స్టోక్స్​ కోసం చెన్నై రూ.16.25 కోట్లు ఖర్చు పెట్టింది. విండీస్​ ప్లేయర్​ నికోలస్​ పూరన్​ ను రూ.16 కోట్లకు లక్నో సూపర్​ జెయింట్స్​ సొంతం చేసుకుంది. దీంతో ఐపిఎల్​ వేలంలో అత్యధిక ధర పలికిన కీపర్​ గా అతడు రికార్డులకెక్కాడు.

ట్యాగ్స్​