13 మిలియన్లు దాటేసిన సమంత ఫాలోవర్స్

By udayam on October 27th / 7:17 am IST

పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత కూడా సినిమాల్లో ఏమాత్రం పాపులారిటీ తగ్గకుండా, రెమ్యునరేషన్ లో కూడా పెంపుదల చూపిస్తూ విజయాలను నమోదు చేసుకుంటున్న అక్కినేని కోడలు సమంత సోషల్ మీడియాలో కూడా తన హవా సాగిస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య తాజగా 13 మిలియన్ల (1.30 కోట్లు)ను దాటింది. ఈ విషయాన్ని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. లాక్‌డౌన్ సమయంలో సమంత ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె ఫాలోవర్ల సంఖ్య మరింత పెరిగింది.

ఇక కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న `బిగ్‌బాస్-4`సీజన్ కి షూటింగ్ కారణంగా దూరం జరిగితే.. కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన సమంత మంచి మార్కులు దక్కించుకుంది. అలాగే త్వరలో `ఫ్యామిలీ మేన్-2` వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.