విజయ్ దేవరకొండ, సమంత కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఖుషి’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. జమ్మూ కశ్మీర్ సంప్రదాయ దుస్తుల్లో కనిస్తున్న విజయ్ తన షర్ట్‌కు సమంత పింక్ శారీకి ముడి వేశారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయనున్నట్లు సైతం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ మధ్యనే షూటింగ్ ప్రారంభమైన ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.