చైతూని ట్యాగ్​ చేయని సమంత

By udayam on September 14th / 6:24 am IST

నాగ చైతన్య, సాయి పల్లవిల ‘లవ్​ స్టోరీ’ ట్రైలర్​ను అభిమానులందరూ లైక్​ చేస్తున్నారు. నాగ చైతన్య భార్య సమంత సైతం ఈ ట్రైలర్​ చూసి టీమ్​కు శుభాకాంక్షలు చెప్పింది. అయితే ఆ సమయంలో సాయిపల్లవిని మాత్రమే ట్యాగ్​ చేసి చైతన్యను మాత్రం వదిలేసింది. దీనిపై చైతన్య అభిమానులు వీరిద్దరి మధ్య ఏదో తేడాగా ఉందే అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని జాతీయ మీడియాలో సైతం ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే చైతన్య కూడా సమంత ట్వీట్ కి థాంక్యూ అని రిప్లై ఇచ్చాడు.

ట్యాగ్స్​