సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు..

By udayam on November 24th / 8:23 am IST

మయోసైటిస్​ వ్యాధితో బాధపడుతున్న నటి సమంత ఆరోగ్యంపై మరోసారి వదంతులు వస్తున్నాయి. ఆమె ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారని తమిళ మీడియా పేర్కొంది. అయితే దీనిపై సమంత మేనేజర్​ స్పందించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని, ఇలాంటి పుకార్లను నమ్మొద్దని కోరారు. సమంత హైదరాబాద్ లో ఓ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే, సమంతకు ఏమీ కాలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

ట్యాగ్స్​