సమంత.. సినిమాలకు మరింత కాలం దూరమే!

By udayam on December 20th / 10:37 am IST

టాలీవుడ్​ అగ్ర హీరోయిన్​ సమంత.. తన మయోసైటిస్​ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి సినిమాలకు మరింత కాలం దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఒప్పుకున్న హాలీవుడ్​, బాలీవుడ్​ ప్రాజెక్టుల నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇటీవలే యశోద వంటి స్పై థ్రిల్లర్​ మూవీలో నటించి మెప్పించిన ఆమె ఆ సినిమా ప్రొమోషన్లలోనూ కాస్త నీరసంగా కనిపించింది. ప్రస్తుతం విజయ్​ దేవరకొండతో ఆమె చేస్తున్న ‘ఖుషీ’ మూవీ కూడా చాలా కాలంగా షూటింగ్​ జరుపుకోవడం లేదు. దీంతో విజయ్​ కూడా వేరే మూవీకి కమిట్​ అయిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​