సామ్​సంగ్​కు రూ.76 కోట్ల జరిమానా

By udayam on June 23rd / 8:53 am IST

తమ ఫోన్లు వాటర్​ రెసిస్టెంట్ అంటూ తప్పుడు ప్రకటనలు చేసిన సామ్​సంగ్​ సంస్థపై ఆస్ట్రేలియా కోర్టు భారీ జరిమానాను విధించింది. లేని ఫీచర్​ను ఉందంటూ టివి ప్రకటనలు గుప్పించడంతో విచారణ జరిపిన కోర్టు శాంసంగ్​ యూనిట్​కు 14 మిలియన్ల ఆస్ట్రేలియన్​ డాలర్లు (మన రూపాయల్లో రూ.76 కోట్లు) జరిమానా విధించింది. 2016 మార్చి, 2018 అక్టోబర్​ల మధ్య ఈ యాడ్స్​ ప్రసారం అయ్యాయని సామ్​సంగ్​ వెల్లడించింది. ఎస్​7, ఎస్​7 ఎడ్జ్​, ఎ6, ఎ7, ఎస్​8, ఎస్​8 ప్లస్, ఎస్ ​నోట్​ 8 మోడల్స్​పై తప్పుడు ప్రచారం చేసినట్లు సామ్​సంగ్​ ఒప్పుకుంది.

ట్యాగ్స్​