భారీ డిస్కౌంట్లతో రేపటి నుంచి శామ్ సంగ్ ‘బ్లాక్ ఫ్రైడే’ సేల్

By udayam on November 23rd / 12:06 pm IST

బ్లాక్​ ఫ్రేడే సందర్భంగా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది ప్రముఖ ఎలక్ట్రానిక్​ కంపెనీ శామ్​ సంగ్​. ఈ నెల 24 నుంచి 28 వరకు జరగనున్న ఈ డిస్కౌంట్ సేల్ లో తన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, గెలాక్సీ బడ్స్, గెలాక్సీ వాచ్ లపై డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించింది. శామ్ సంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్, గెలాక్సీ ఎస్22, ఎస్ 22 అల్ట్రా స్మార్ట్ ఫోన్ల ధరలు సాధారణ రోజుల్లో రూ.72,999 నుంచి ఆరంభమవుతుంటే.. బ్లాక్ ఫ్రైడే సేల్ లో రూ.60,000 నుంచి అందుబాటులో ఉంటాయి. ఇక గెలాక్సీ జెడ్ సిరీస్ ఫోన్లు అయిన.. జెడ్ ఫ్లిప్ 4, జెడ్ ఫ్లిప్ 3, జెడ్ ఫోల్డ్ 4 ధరలు సాధారణ రోజుల్లో రూ.80,999 నుంచి మొదలవుతుంటే, ఈ సేల్ లో రూ.67,999 నుంచి లభించనున్నాయి. హెచ్​.డి.ఎఫ్​.సి., ఐసిఐసిఐ, యాక్సిస్​, కోటక్​ బ్యాంకు కార్డులపై క్యాష్​ బ్యాక్​ ఆఫర్లూ ఇచ్చింది.

ట్యాగ్స్​