సామ్​సంగ్​: 5 ఏళ్ళలో $350 బిలియన్ల పెట్టుబడులు

By udayam on May 24th / 12:58 pm IST

వచ్చే ఐదేళ్ళలో సెమీ కండక్టర్లు, బయో ఫార్మాస్యూటికల్స్​ రంగాల్లో 350 బిలియన్​ డాలర్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్లు సామ్​సంగ్​ ప్రకటించింది. ఈ రంగంలో తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు గానూ ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయని ఈ దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ ప్రకటించింది. ఈ మొత్తం పెట్టుబడుల్లో 80 శాతాన్ని కేవలం రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ కిందే ఖర్చుచేయనున్నట్లు పేర్కొంది. గత 5 ఐదేళ్ళలో తాము పెట్టిన పెట్టుబడులతో పోల్చితే ఇది 3 రెట్లు ఎక్కవని పేర్కొంది.

ట్యాగ్స్​