3:47 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

కాన్సర్ ని జయిస్తా :సంజయ్ దత్ 2 weeks ago

గత ‌కొన్ని రోజుల నుండి ఊపిరితిత్తుల క్యానర్స్‌తో బాధపడుతున్న బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్ ముంబైలోనే‌ చికిత్స తీసుకుంటున్నారు. క్యాన్సర్‌ నివారణలో భాగంగా కీమోథెరపీ చికిత్సను తీసుకుంటూనే.. బాబా సినిమా షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. “గత కొన్నిరోజుల నుండి క్యాన్సర్‌ నన్నెంతో భయపెట్టింది. అయితే దాన్ని నేను కచ్చితంగా గెలిచి తీరుతాను. త్వరలోనే నేను క్యాన్సర్‌ బారి నుండి బయటపడతాను” అని ఓ వీడియో సందేశంలో సంజయ్ చెప్పారు.

View this post on Instagram

My day just got better with @duttsanjay entering our Salon HA… It’s always such a delight to see him but today was something else…. A whole lot of emotions caught up as we go a long way and share such beautiful memories together.❤️ Sanjay Dutt at Salon Hakim’s Aalim after getting a haircut done with all the necessary precautions Instructed by the government and the experts. #SanjayDutt #AalimHakim #Rockstar #SalonHakimsAalim #TeamHA #SafetyFirst #Precautions #Hygiene #SocialDistancing #NewNorms #TeamHakimsAalim #SalonLife #Viral #Trending #MovieLife #razorcuts #ActorsLife #fighter #warrior #babarocks #friends #menshair #mensfunkyhairstyle #funkyhaircolouring #legacy #habarberingcompany💈 @duttsanjay @aalimhakim

A post shared by Aalim Hakim (@aalimhakim) on

అలాగే దక్షిణాదిన చేస్తున్న ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2’ షూటింగ్‌లో నవంబర్‌ నుండి పాల్గొనబోతున్నట్లు కూడా సంజయ్ చెప్పుకొచ్చారు. యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2’ చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇందులో మెయిన్‌ విలన్‌ అధీరా పాత్రలో  సంజయ్‌దత్‌ చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్‌గా‌ రీస్టార్ట్‌ అయ్యింది. అయితే సంజయ్‌దత్‌ నటించాల్సిన సన్నివేశాలు మినహా మిగిలిన షూటింగ్‌ను ఈ నెలాఖరుకి పూర్తి చేస్తామని మేకర్స్‌ తెలిపారు. నవంబర్‌లో సంజయ్‌దత్‌పై సన్నివేశాలను పూర్తి చేయనున్నారు. ‘కేజీయఫ్ చాప్టర్ 2’లో అధీరా పాత్రకు సిద్ధమవుతున్నానంటూ సంజయ్ దత్ కొన్ని ఫొటోలతో ట్వీట్ కూడా షేర్ చేయడం విశేషం.