సంగక్కర నాపై ఒత్తిడి ఉండనివ్వడు : శాంసన్​

By udayam on April 6th / 2:10 pm IST

రాజస్థాన్​ రాయల్స్​ కొత్త కెప్టెన్​ సంజు శాంసన్​ ఆ జట్టు కోచ్​, శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార్​ సంగక్కరను పొగడ్తలతో ముంచెత్తాడు. సంగాతో కలిసి చర్చలు జరిపిన తర్వాత తన మీద ఉన్న ఒత్తిడి తగ్గినట్లు అనిపిస్తుందని సంజు చెప్పాడు. కెప్టెన్​గా ఎంపికైన అనంతరం తనకు కోహ్లీ, ధోనీ, రోహిత్​లు అభినందలు చెబుతూ మెసేజ్​లు పెట్టారని చెప్పాడు. సంగక్కర కోచ్​గా ఉన్నంతకాలం తాను ఇంకెవరిపై సలహాల కోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదని అనుకుంటున్నట్లు శాంసన్​ అన్నాడు.

ట్యాగ్స్​