ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి సెలవుల జాబితా వచ్చేసింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 17న తిరిగి తెరుచుకుంటాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తంలో 220 రోజులు పాఠశాలలు పనిచేయనుండగా.. 80 రోజులు సెలవులు ఉంటాయి. జూనియర్ కళాశాలలకు జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ఇక తెలంగాణలో 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి.