డూడుల్‌ ఆర్టిస్ట్‌తో శ్రుతీహాసన్‌ !

By udayam on February 23rd / 6:17 am IST

డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో శ్రుతీహాసన్‌ ప్రేమలో ఉన్నారని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య శ్రుతీ బర్త్‌డేకి శాంతను పెట్టిన పోస్టులు, ముంబైలో వీళ్లు ప్రేమగా చక్కర్లు కొట్టడం ఈ వార్తలకు బలం ఇస్తున్నాయి.

తాజాగా వీరిద్దరూ కలసి ఓ మ్యూజిక్‌ వీడియో చేయడానికి రెడీ అయ్యారట. పైగా కొంతకాలంగా మ్యూజిక్‌ కంపోజింగ్‌ మీద కూడా శ్రుతి బాగా దృష్టిపెట్టింది.

లండన్‌లో కొన్ని షోలు కూడా చేసిన శృతి  తాజాగా చేస్తున్న మ్యూజిక్‌ వీడియోలో శాంతను ర్యాప్‌ పాడనున్నారట. ఇంతకుముందు ర్యాపర్‌గా కొన్ని పాటలు పాడిన అనుభవం శాంతనుకు ఉంది.

రికార్డింగ్‌ స్టూడియోలో ఈ మ్యూజిక్‌ వీడియోకి పని చేస్తూ శాంతనుతో సరదాగా చిన్న వీడియోను షేర్‌ చేసింది. ఈ మ్యూజిక్‌ వీడియో ఎప్పుడు బయటకు వస్తుందో! వారి రిలేషన్‌షిప్‌ గురించి  ఎప్పుడు బయటపెడతారో!!

ట్యాగ్స్​