సుప్రసిద్ధ సంతూర్ వాయిద్యకారుడు పండిట్ శివకుమార్ శర్మ ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. జమ్మూలో జన్మించిన పండిట్ శివకుమార్.. తన 13 ఏళ్ళ వయసులోనే సంతూర్‌పై సరిగమలు దిద్దారు. సిల్సిలా, చాందినీ, దార్ వంటి బాలీవుడ్ మూవీస్‌కు ఆయన మ్యూజిక్ డైరెక్టర్‌గానూ వ్యవహరించారు. 1991లో ఆయనకు పద్మశ్రీ, 2001లో పద్మ విభూషణ్ అవార్డులు దక్కాయి. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లు సంతాపం వ్యక్తం చేశారు.