తీహార్‌ జైల్‌కు శరత్‌ చంద్రారెడ్డి

By udayam on November 22nd / 10:51 am IST

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్‌ అయిన అరబిందో డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డిని తీహార్‌ జైల్‌కు తరలించారు. ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) శరత్‌ చంద్రారెడ్డి, పెర్నాడో రికార్డ్‌ కంపెనీ ప్రతినిధి బినోరు బాబు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం రౌస్‌ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో జస్టిస్‌ ఎంకె నాగ్‌పాల్‌ ముందు వీరిని ఇడి అధికారులు హాజరుపరిచారు.

ట్యాగ్స్​