మిసెస్‌ వరల్డ్‌ విజేతగా సర్గమ్‌ కౌశల్‌

By udayam on December 19th / 10:44 am IST

దాదాపు 21 ఏళ్ల తర్వాత మిసెస్‌ వరల్డ్‌ పోటీల్లో భారత్‌కు చెందిన మహిళ విజేతగా నిలిచారు. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో 63 దేశాల మహిళలు పాల్గొన్నారు. జమ్ముకాశ్మీర్‌కు చెందిన సర్గమ్‌ కౌశల్‌ విజేతగా నిలిచారు. ఆమెకు 2021లో మిసెస్‌ వరల్డ్‌ విజేత షాయలిన్‌ ఫోర్డ్‌ (అమెరికా) కిరీటాన్ని బహుకరించారు. మిసెస్‌ పాలినేషియా తొలి రన్నరప్‌గా.. మిసెస్‌ కెనడా రెండో రన్నరప్‌గా నిలిచారు. వివాహిత మహిళల కోసం ఈ పోటీలను 1984 నుంచి నిర్వహిస్తున్నారు. 2001లో భారత్‌కు చెందిన డాక్టర్‌ అదితీ గోవిత్రికర్‌ తొలిసారి ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు.

ట్యాగ్స్​