ఈ గురువారం విడుదలైన మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట తెలుగు రాష్ట్రాల్లో గట్టిగానే వసూళ్ళను దక్కించుకుంది. మహేష్ కెరీర్లోనే తొలిరోజు అత్యధిక వసూళ్ళతో ఎపి, తెలంగాణల్లో రూ.36.63 కోట్లను, వరల్డ్‌వైడ్ రూ.75 కోట్ల గ్రాస్‌ను సాధించింది. నైజాంలో రూ.12.24 కోట్లు, సీడెడ్‌లో రూ.4.7 కోట్లు, తూర్పులో రూ.3.25 కోట్లు, పశ్చిమ రూ.2.74 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.3.74 కోట్లు, గుంటూరు రూ.5.83 కోట్లు, కృష్ణలో రూ.2.58 కోట్లు, నెల్లూరులో రూ.1.56 సాధించింది.