పే పర్​ వ్యూ : అమెజాన్​లోకి సర్కారు వారు

By udayam on June 2nd / 10:26 am IST

బాక్సాఫీస్​ వద్ద గట్టిగానే పాట పాడిన మహేష్​ తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ఇప్పుడు ప్రైమ్​లోకి వచ్చేసింది. అదేంటి ఎలాంటి ప్రచారం లేకుండా అనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్​.. ఈ మూవీని పే పర్​ వ్యూ పద్దతిలో ప్రైమ్​ స్ట్రీమింగ్​ చేస్తోంది. ఒక్కసారి సినిమా చూడాలంటే రూ.199 చెల్లించి అద్దె ప్రాతిపదికన ఈ మూవీని స్ట్రీమ్​ చేయొచ్చు. గతంలో కెజిఎఫ్​ ఛాప్టర్​ 2 ను కూడా ప్రైమ్​లో ఈ విధంగానే స్ట్రీమ్​ చేసిన సంగతి తెలిసిందే.

 

ట్యాగ్స్​