మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట ఓటిటి రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. బాక్సీఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్ళను కొల్లగొడుతున్న ఈ మూవీ రైట్స్ కోసం ప్రైమ్ భారీ మొత్తం ఆఫర్ చేసిందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ మూవీకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించాడు. బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.