ఈనెల 12న విడుదల కానున్న మహేష్ బాబు మూవీ ‘సర్కారు వారి పాట’ నుంచి ట్రైలర్ లాంచ్ అయింది. తనకే సొంతమైన కామెడీ టైమింగ్‌తో మహేష్‌బాబు చెలరేగిపోయాడు. ఎపి సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేస్తూ ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’, ‘అందరూ నీలానే అనుకుంటున్నారు.. మెయింటెయిన్ చేయలేక దూల తీరిపోతోంది’ అంటూ మహేష్ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. కలెక్షన్ ఏజెంట్‌గా మహేష్ నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సముద్రఖని, సుబ్బరాజులు నటించారు.