మన సౌర కుటుంబంలోని అత్యంత సుదూరంగా ఉన్న శని గ్రహం.. ఆ గ్రహంలోని వాతావరణ పరిస్థితులను బట్టి రంగుల్ని మార్చుకుంటున్నట్లు హబుల్ టెలిస్కోప్ తొలిసారిగా గుర్తించింది. ఈ మేరకు నాసా కొన్ని ఫొటోల్ని విడుదల చేసింది. ఆ గ్రహం మీద వేసవి నుంచి తర్వాత సీజన్‌కు మారే క్రమంలో వీసే గాలులు, మబ్బుల ఎత్తును బట్టి ప్రతీ ఏటా ఈ గ్రహం తన రంగును మార్చుకుంటున్నట్లు నాసా తెలిపింది. ఈ సమయంలో 1000 మైళ్ళ వేగంతో గాలులు వీయడంతో ఈ మార్పులకు కారణంగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు.