మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల బిజెపి విడుదల చేసిన వరుస వీడియోల నేపథ్యంలో ఆయనను సందర్శకులు కూడా కలుసుకునేందుకు లేకుండా 15 రోజుల పాటు శిక్ష విధించింది. అలాగే అతనికి సెల్, టేబుల్, కుర్చి వంటి అన్ని సౌకర్యాలను తొలగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధి డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల మేరకు సత్యేందర్‌పై ఈ చర్యలు తీసుకున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.