తమ దేశంలో తిరిగి కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ సౌదీ అరేబియా 16 దేశాల విమాన రాకపోకలపై తిరిగి నిషేధం విధించింది. భారత్తో పాటు లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, అర్మేనియా, బెలారస్, వెనెజులా దేశాల నుంచి ఎవరూ సౌదీలోకి రాకుండా చర్యలు తీసుకుంది. శనివారం ఆ దేశంలో 413 కేసులు రాగా.. ఆదివారం ఆ సంఖ్య 600లకు చేరింది. దీంతో ఆ దేశం తక్షణ నివారణ చర్యలు చేపట్టింది.