పెను సంచలనం: ప్రపంచకప్​ లో సౌదీ చేతిలో అర్జెంటీనా ఓటమి

By udayam on November 23rd / 5:07 am IST

ఖతార్​ లో జరుగుతున్న ఫిఫా ఫుట్​ బాల్​ వరల్డ్​ కప్​ లో మంగళవారం సాయంత్రం పెను సంచలనం నమోదైంది. పసికూన సౌదీ అరేబియా.. దిగ్గజ అర్జెంటీనా జట్టును 2–1 తేడాతో ఓడించి ప్రపంచానికి షాక్​ ఇచ్చింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకూ నమోదైన సంచలన విజయాల్లో ఇదీ ఒకటని ఫిఫా వరల్డ్ కప్ అధికారిక ట్విటర్ ఖాతా ట్వీట్ చేసింది.మ్యాచ్‌లో అర్జెంటీనా తరపున స్టార్ ఆటగాడు మెస్సీ ఏకైక గోల్ చేయగా, సౌదీ అరేబియా తరపున అల్ షెహ్రీ, అల్ దవ‌సరీలు చెరొక గోల్ చేశారు.

ట్యాగ్స్​