కఠినాతికఠినమైన శిక్షలకు మారుపేరైన సౌదీ అరేబియాలో గత 10 రోజుల్లో 12 మందిని కత్తితో తల నరికిన ఘటనలు చోటు చేసుకున్నట్లు మానవ హక్కుల సంఘాలు వెల్లడించాయి. డ్రగ్ సంబంధిత కేసుల్లో నిందితులుగా ఉన్న 10 మందికి ఇలా మరణ శిక్షల్ని అమలు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు పాకిస్థానీలు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డానియన్లు, ముగ్గురు సౌదీ అరేబియన్లు ఉన్నారు.ఈ ఏడాది మార్చి నెలలో 81 మందికి ఈ దేశంలో ఇలాంటి మరణ శిక్షలే అమలు అయ్యాయి. వారంతా టెర్రరిజంలో పాల్గొన్నట్లు నేరం నిరూపితం అయింది.