హజ్ యాత్రికులపై ఆంక్షలు ఎత్తేసిన సౌదీ

By udayam on January 10th / 6:57 am IST

ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే హజ్ యాత్రపై సౌదీ అరేబియా ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. మక్కా సందర్శించడానికి ప్రతి ఏటా కోట్లమంది జనాలు తరలి వస్తారు. అయితే, కరోనా కారణంగా సౌదీ అరేబియా ప్రభుత్వం గత మూడేండ్లుగా కొన్ని ఆంక్షలు పెట్టింది. వాటిని తొలగిస్తూ సౌదీ మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్ రబియా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కరోనా కారణంగా మక్కా సందర్శకుల సంఖ్యను 10 లక్షలకు తగ్గించింది. హజ్ ఎక్స్ పో 2023 ప్రారంభం కానుండగా.. ఇప్పుడు ఆ ఆంక్షలను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్​