తుక్కు కానున్న రూ.2,254 కోట్ల విమానం

By udayam on May 6th / 1:53 pm IST

సౌదీ క్రౌన్​ ప్రిన్స్​ ముచ్చటపడి స్విట్జర్లాండ్​ రాజు వద్ద కొన్న బోయింగ్​ 747 లగ్జరీ విమానం తుక్కు తుక్కు కానుంది. 2005–11 మధ్య సౌదీకి క్రౌన్​ప్రిన్స్​గా ఉన్న సుల్తాన్​ బిన్​ అబ్దులజీజ్​ అల్​ సావూద్​ దీనిని రూ.2,254 కోట్లకు కొన్నారు. అయితే అది ఆయన వద్దకు వచ్చేటప్పటికీ ఆయన మరణించారు. దీంతో 2012 నుంచి ఈ విమానం కేవలం 42 గంటల విమాన ప్రయాణాన్ని మాత్రమే జరుపుకుంది. పదేళ్ళుగా మూలనపడ్డ దీనిని తుక్కు కింద అమ్మేయాలని యువరాజు కుటుంబం నిర్ణయించింది.

ట్యాగ్స్​