రూ.300 కోట్ల జరిమానాగా వసూలు చేసిన ఎస్​బిఐ

By udayam on April 12th / 6:41 am IST

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్​ ఎస్​బిఐ ఖాతాదారుల జేబులకు గుల్ల చేయడంలోనూ నెంబర్​ వన్​గానే ఉంది. 2015–20 మధ్య కాలంలో జీరో బ్యాలెన్స్​ అకౌంట్లలో డబ్బులు ఉంచని 12 కోట్ల ఖాతాదారుల నుంచి ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసినట్లు ఐఐటి–బాంబే సర్వేలో వెల్లడైంది. అదే సమయంలో పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ 3.9 కోట్ల ఖాతాదారుల నుంచి కేవలం రూ.9.9 కోట్లనే వసూలు చేసింది. ఆర్​బిఐ రెగ్యులేషన్లను ఎస్​బిఐ అతిక్రమించి ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేసిందని ఆ సర్వే తెలిపింది. ఒక్కో అకౌంట్​ నుంచి ఏకంగా రూ.17.70 వసూలు చేయడం అన్యాయమని ఆ సర్వే తెలిపింది.

ట్యాగ్స్​
SBI