యోనో యాప్​తో ఉచితంగా ఐటిఆర్​ సేవలు

By udayam on October 8th / 8:10 am IST

తన వినియోగదారుల సౌలభ్యం కోసం ఎస్​బిఐ తన యోనో యాప్​లో మరో ఫీచర్​ను తీసుకొచ్చింది. దీని సాయంతో ఇన్​ కం ట్యాక్స్​ రిటర్న్స్​ను (ఐటిఆర్​ ఫైలింగ్​) ఉచితంగా చేసుకునే అకవాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం వినియోగదారులు పాన్​ కార్డ్​, ఆధార్​ కార్డ్​, ఫారం 16, పన్ను మినహాయింపు వివరాలు, వడ్డీ ఆదాయం సర్టిఫికెట్లు, పన్ను ఆదా పెట్టుబడికి సంబంధించిన ప్రూఫ్​లు సమర్పించాల్సి ఉంటంది. యోనో యాప్ లోని షాప్స్​ అండ్​ అదర్స్​లోకి వెళ్ళి టాక్స్​ అండ్​ ఇన్వెస్ట్​మెంట్​ను సెలక్ట్​ చేయాల్సి ఉంటుంది. అక్కడ ట్యాక్స్​ 2 విన్​ ఆప్షన్​పై క్లిక్​ చేసి అక్కడ కనిపించిన ఖాళీల్ని పూరించాల్సి ఉంటుంది.