వడ్డీ రేట్లు మళ్ళీ పెంచిన ఎస్​బిఐ

By udayam on May 17th / 6:33 am IST

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ సంస్థ ఎస్​బిఐ తన నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటును పది బేసిస్​ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రుణ గ్రహీతలపై నెలవారీ వడ్డీ భారం పెరగనుంది. ఎంసీఎల్​ఆర్​ వడ్డీ రేటును ఎస్​బిఐ 10 బేసిస్​ పాయింట్లు చొప్పున పెంచడం 10 రోజుల్లో ఇది రెండోసారి. తామిచ్చే రుణాలపై వడ్డీ రేటు రెపోను ఆర్బీఐ 40 బేసిస్​ పాయింట్లు పెంచిన నేపధ్యంలో ఎస్​బిఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్​బిఐ తర్వాత మరిన్ని బ్యాంకులు సైతం ఇదే బాటలో నడవనున్నాయి.

 

ట్యాగ్స్​