ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్బిఐ భారత వృద్ధి రేటును 2022–23 ఏడాదికి గానూ 20 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.5 శాతానికి పరిమితం చేసింది. ఈ ఏడాది భారత ఆర్ధిక వ్యవస్థ 8.7 శాతం పెరిగుతుందని పేర్కొంది. దీంతో 11.8 లక్షల కోట్ల రూపాయలు అదనంగా జత అవ్వడంతో పాటు భారత ఆర్ధిక వ్యవస్థ మొత్తంగా రూ.147 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2020 ఏడాదితో పోల్చితే ఈ శాతం కేవలం 1.5 శాతమేనని అందువల్లనే వృద్ధి రేటును తగ్గిస్తున్నట్లు పేర్కొంది.