ఎస్​బిఐ వాట్సాప్​ బ్యాంకింగ్​

By udayam on July 2nd / 7:02 am IST

ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్​ ఎస్​బిఐ త్వరలోనే వాట్సాప్​ బ్యాంకింగ్​ సర్వీస్​ను ప్రారంభించనుంది. గత గురువారం నాడు దేశవ్యాప్తంగా ఎస్​బిఐ సేవలు నిలిచిపోయిన వేళ ఆ సంస్థ ఛైర్మన్​ దినేష్​ ఖరా.. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే ఈ ప్రకటన చేశారు. తమ వినియోగదారులకు అప్లికేషన్​ ప్రోగ్రామింగ్​ ఇంటర్​ఫేస్​ (ఎపిఐ) సేవలను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. అత్యంత సురక్షితమైన, వేగవంతమైన సర్వీసులను మరింత చేరువ చేసేందుకు ఈ ఎపిఐ ను తీసుకొస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్​