కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞాన్వాపి మసీదు నీటి మడుగులో శివలింగం బయటపడ్డ వార్తలపై సుప్రీం స్పందించింది. శివలింగం బయటపడ్డ ప్రాంతం వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని, అదే సమయంలో ఈ మసీదులో ముస్లింలు నమాజ్ చేసుకోవడాన్ని అడ్డుకోరాదని పేర్కొంది. మే 19న తిరిగి ఈ కేసుపై విచారణ జరుపుతామని తెలిపింది. దీంతోపాటు జ్ఞాన్వాపి మసీదు వీడియోగ్రఫీని కోర్టుకంటే ముందు మీడియాకు లీక్ చేసిన అడ్వొకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను ఈ విచారణ నుంచి తొలగించింది.