తెలుగు రాష్ట్రాల్లో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో కలిపి ఐదుగురు న్యాయమూర్తుల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కు చెందిన బట్టు దేవానంద్ ను మద్రాస్ హైకోర్ట్ కు, ఎపికి చెందిన జస్టిస్ డి.రమేష్ ను అలహాబాద్ హైకోర్ట్ కు, తెలంగాణకు చెందిన లలిత కన్నెగంటిని కర్ణాటక హైకోర్టుకు, డి.నాగార్జున ను మదవ్రాస్ హైకోర్టుకు, అభిషేక్ రెడ్డిని పట్నా హైకోర్ట్ కు బదిలీ చేశారు.