పోలవరం ప్రాజెక్టు పర్యావరణ ఉల్లంఘనలపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్‌జిటి తీర్పును సవాల్ చేస్తూ సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. పర్యావరణ, అనుమతులు, పట్టిసీమ, పురుషోత్తపట్నం, పోలవరం డ్యాం వద్ద కొత్త లిఫ్ట్ పథకం ఉల్లంఘనలపై కేంద్ర పర్యావరణ శాఖ సైతం నిషేధ ఉత్తర్వులు జారీ చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీంతో కేంద్రం, ఎపి, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది.