షర్మిల పై ఎస్​సి, ఎస్​టి అట్రాసిటీ కేసు

By udayam on October 4th / 7:17 am IST

వైఎస్​ఆర్​టిపి నేత షర్మిల ఫై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్న సమయంలో షర్మిల ఆంధోల్‌ నియోజకవర్గం జోగిపేటలో స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ను అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు షర్మిలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గౌరవపదమైన హోదాలో ఉన్న దళిత బిడ్డను పేరు పెట్టి కాకుండా అవమానకరంగా మాట్లాడినందుకు వైఎస్‌ షర్మిలపై ఎష్​సి, ఎస్​టి చట్టం కింద కేసు నమోదుచేయాలని దళిత నాయకులు పోలీసులను కోరారు.

ట్యాగ్స్​