ఐపిఎల్ ముగిసిన వెంటనే సౌత్ ఆఫ్రికా జట్టుతో ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 9 నుంచి 19 వరకూ ఈ పొట్టి క్రికెట్ సిరీస్ జరగనుంది. జూన్ 9న తొలి టి20 ఢిల్లీ వేదికగా ప్రారంభం కానుంది. ఆపై 12న 2వ టి20 కటక్‌లోనూ, 14న 3వ టి20 వైజాగ్‌లోనూ, 17న 4వ టి20 రాజ్‌కోట్‌లోనూ, 19న చివరి టి20 మ్యాచ్ బెంగళూరు వేదికగానూ జరగనుంది. ఆస్ట్రేలియాలో సెప్టెంబర్ నుంచి జరగనున్న టి20 వరల్డ్ కప్‌కు ముందు భారత్‌కు ఇదే చివరి టి2 సిరీస్.