ఉత్తర భారతంపై చలి పులి పంజా విసురుతోంది. ఉత్తరాదిలో సోమవారం అనేక ప్రాంతాల్లో 3 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్టోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశరాజధాని ప్రాంతంలో దట్టమైన పొగమంచు, చలిగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. బీహార్, ఒడిషా రాష్ట్రాల్లో అధిక ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. దీంతో ప్రజల జనజీవనం స్థంభించింది. బీహార్‌లో పాట్నా జిల్లాలో 8వ తరగతి వరకూ ఈ ఏడాది మొత్తం సెలవులు ప్రకటించారు. ఉత్తరభారతంలో అత్యల్పంగా రాజస్థాన్‌లోని చురులో సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.