రాజస్థాన్ లో చలి ఉధృతి తీవ్రమైంది. దీంతో ఈ రాష్ట్ర రాజధానితో పాటు పలు ప్రాంతాల్లో స్కూల్స్ కు శీతాకాల సెలవులను జారీ చేస్తోంది ఇక్కడి ప్రభుత్వం. డిసెంబర్ 25 నుంచి జనవరి 5 వరకూ ఇప్పటికే స్కూల్స్ ఇచ్చేసిన సర్కార్.. ఇప్పుడీ సెలవులను ఈనెల 9 వరకూ పొడిగించింది. ఈ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోయాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చురు మరియు సికర్‌లలో మైనస్ 1.5 డిగ్రీల సెల్సియస్‌తో మైదాన ప్రాంతాలపై దేశంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది.