సైబీరియా వద్ద గడ్డకట్టిన ఓ సరస్సు అడుగు భాగంలో 48,500 ఏళ్ల నాటి రాకాసి వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వేల సంవత్సరాలుగా అవి నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ, వ్యాధి కారక శక్తిని మాత్రం కోల్పోలేదని తెలుసుకున్నారు. వాటిలో 13 రకాల హానికరమైన సూక్ష్మజీవ జాతులను గుర్తించి, వాటిని వర్గీకరించారు. అత్యంత ఘనీభవించిన ఈ మంచు కరిగిపోతే బయటి వాతావరణంలోకి విడుదలయ్యే ఈ రాకాసి వైరస్ లు జంతువులకు, మానవాళికి పెను సమస్యగా పరిణమిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.