బ్రిటన్​లో పడ్డ ఆస్టరాయిడ్​పై నీళ్ళు..

By udayam on September 19th / 7:05 am IST

గతేడాది యుకెలోని గ్లౌసెష్టర్​ షైర్​లో పడ్డ ఓ భారీ ఉల్కలో నీటి జాడల్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. 2021 ఫిబ్రవరిలో ఇది బ్రిటన్​లో పడింది. అప్పటి నుంచి దీనిపై పరిశోధనలు చేస్తున్న మన శాస్త్రవేత్తలు ఈ రాయిలో నీళ్ళు ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోతున్నారు. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం భూమి పైకి నీరు ఎలా వచ్చిందన్న చిక్కుముడిని ఈ గ్రహ శకలం బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని, దీనిపై మరింత పరిశోధనలు జరుగుతున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్​