బంగ్లాదేశ్​కు షాక్​ ఇచ్చిన స్కాట్లాండ్​

By udayam on October 18th / 6:48 am IST

టి20 వరల్డ్​ కప్​ తొలి మ్యాచ్​లోనే సంచలన ప్రదర్శనతో స్కాట్లాండ్​ ఆకట్టుకుంది. పెద్ద జట్లతో సమానంగా ఎదుగుతున్న బంగ్లాదేశ్​పై తన తొలి మ్యాచ్​లో 6 పరుగుల తేడాతో గెలుపొందింది. స్కాట్లాండ్​ స్టార్​ ఆల్​రౌండర్​ క్రిస్​ గ్రీవ్స్​ బ్యాటింగ్​, బౌలింగ్​లోనూ రాణించడంతో ఈ విజయం సాధ్యమైంది. తొలుత బంగ్లా బౌలర్ల ధాటికి 53కే 6 వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్​ను గ్రీవ్స్​ 28 బంతుల్లో 45 పరగులు చేసి ఆదుకున్నాడు. ఆపై బౌలింగ్​లో ముఫ్షికర్​ రహీం, షకీబ్​ అల్​ హసన్​ వంటి స్టార్ల వికెట్లు తీసి స్కాట్లాండ్​కు మరిచిపోలేని విజయాన్ని అందించాడు.

ట్యాగ్స్​