బీహార్​: దలైలామా పర్యటనలో చైనా మహిళా గూఢచారి!

By udayam on December 29th / 10:44 am IST

బీహార్​ లోని బౌద్ధుల పవిత్ర పుణ్యక్షేత్రం బుద్ధ గయ లో గురువారం నుంచి మూడు రోజుల పాటు పర్యటిస్తున్న దలైలామా పర్యటన కోసం కట్టుదిట్టమైన భద్రతను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పర్యటనలో దలైలామా కదలికలు తెలుసుకోవడానికి ఇప్పటికే బుద్ధగయకు చైనా నుంచి ఓ మహిళా గూఢచారి వచ్చి ఉందన్న అనుమానాలతో స్థానిక పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. చైనా మహిళ స్కెచ్​ తో పాటు, ఆమె పాస్​ పోర్ట్​ వివరాలను కూడా పోలీసులు విడుదల చేశారు. గత రెండేళ్ళుగా ఆమె బుద్ధ గయ లోనే ఉంటోందని తెలుస్తోంది.

ట్యాగ్స్​