పంజాబ్ పాపులర్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తామే చేశామని లారెన్స్ బిష్ణోయి గ్యాంక్, కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌లు ప్రకటించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వార్తల నేపధ్యంలో ఢిల్లీ తీహార్ జైలులో ఉంటున్న లారెన్స్ బిష్ణోయి సెల్ వద్ద తనిఖీలు జరుగుతున్నాయి. దాడుల్లో ఎలాంటి ఆధారాలు దొరికాయన్న దానిపై ఇంకా తీహార్ పోలీసులు ప్రకటన చేయలేదు. ‘జైలులో నిషేధించబడ్డ వస్తువులు బిష్ణోయి సెల్లో లభించాయి’ అని హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.