ఫామ్ లేమితో సతమతమవుతున్న దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఐపిఎల్ ముగిసిన వెంటనే ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా, ఐర్లాండ్ సిరీస్లకు అతడికి ‘విశ్రాంతి’ని ఇవ్వాలని భావిస్తున్నారు. ఒక రకంగా ఇది అతడిపై వేటు వేయడమేనని తెలుస్తోంది. గతంలో రహానే, పూజారాలను సైతం ఇలానే తప్పించిన సెలక్టర్లు ఇప్పుడు కోహ్లీకి అదే ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు. ఐపిఎల్లో ఇప్పటి వరకూ 12 మ్యాచులు ఆడిన కోహ్లీ 19 సగటుతో 216 పరుగుల చేశాడు.