సీనియర్​ నటుడు కైకాల కన్నుమూత

By udayam on December 23rd / 5:32 am IST

సీనియర్​ నటుడు కైకాల సత్యనారాయణ (87) ఈ ఉదయం 4 గంటలకు కన్నుమూశారు. 60 సంవత్సరాల సినీ జీవితంలో ఆయన 777 సినిమాల్లో నటించారు. 1935 జులై 25న జన్మించిన ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో తనదైన శైలితో ఆబాల గోపాలాన్ని అలరించారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్ నగర్‌లోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, కుమారులు ఉన్నారు. రేపు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

ట్యాగ్స్​