హర్యానా రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మరోసారి వార్తల్లో నిలిచారు. 30 ఏళ్ల తన కెరీర్లో ఆయన 56వ సారి బదిలీ అయ్యారు. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను అదే హోదాలో ప్రభుత్వ ప్రాచీన పత్ర భాండాగార (ఆర్కైవ్స్) శాఖకు బదిలీ చేశారు. చీఫ్ సెక్రటరీకి ఆయన రాసిన లేఖ బదిలీకి కారణం అని చెపుతున్నారు. ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న శాఖను ఉన్నత విద్యా శాఖలో విలీనం చేయడంతో తనకు పని లేకుండా పోయిందని లేఖలో ఖేమ్కా పేర్కొన్నారు.